
Indian Students in US: లక్షలు పోస్తేనే కానీ అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవాలనే కోరిక తీరనిది. అయితే ఆస్తులు అమ్మైనా కానీ పిల్లలను ఉన్నత చదువుల కోసం పంపించటం కోసం ఇండియన్ మధ్యతరగతి ఫ్యామిలీలు వెనుకాడటం లేదు. ఎందుకంటే తమ పిల్లలు అక్కడి స్థిరపడితే డాలర్లలో సంపాదన, మంచి భవిష్యత్తు, ఉన్నత జీవిత శైలి వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడిగా అడుగుపెట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.
అమెరికాలో మంచి ఉపాధి అవకాశాలు పొందటం అనేది విదేశీ విద్యార్థులకు ప్రస్తుతం పెద్ద కలగా మారిపోతోంది. ట్రంప్ అధ్యక్షతన అక్కడి అధికారులు వీసా ప్రాసెసింగ్, ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినంగా మార్చటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే విద్యార్థులకు గతంలో మాదిరిగా పార్ట్ టైం ఉద్యోగాలు లభించకపోవటం, క్యాంపస్ బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలను చాలా మంది నిలిపివేయటం వంటివి ఆర్థికంగా ఇబ్బందులను కూడా పెంచుతున్నాయి.
Also Raed : చెమటలు పట్టిస్తున్న గోల్ట్ రేట్లు
ఇలాంటి అద్వాన్న పరిస్థితులు కొనసాగుతున్న వేళ విద్యార్థులు ఇంటికి వెళ్లాలనే ట్రావెల్ ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారని తేలింది. ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో వస్తున్న మార్పుల గందరగోళం దృష్ట్యా చాలా మంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 2024లో అమెరికా అధికారులు దాదాపు 41 శాతం మంది విద్యార్థులకు ఎఫ్ 1 వీసాల దరఖాస్తులను నిరాకరించారు. అయితే ఇప్పుడు దేశం దాటివెళ్లిన తర్వాత వీసాలను క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటనే ఆందోళనలు చాలా మంది భారతీయ విద్యార్థులను ప్రస్తుతం వెంటాడుతున్నాయి.
దీనికి అనుగుణంగానే బ్రౌన్స్, కార్నిల్, ఎంఐటీ, కొలంబియా, యేల్ వంటి కాలేజీలు తమ విద్యార్థులు, ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ అమెరికా వీడి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే ఇండియాలోని అనేక విదేశీ కన్సల్టెన్సీలు సైతం భారతీయ స్టూడెంట్లకు ఇదే సూచన చేస్తున్నాయి. ఇదే క్రమంలో టెక్ సావీ ఇండియన్ పేరెంట్స్ ఈ ఆందోళనను పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అధికారుల తీవ్ర నిఘా కొనసాగుతున్న వేళ అమెరికాలోని విద్యార్థులు ఆన్‌లైన్‌తో సహా సామాజిక లేదా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు.
ప్రస్తుత మెరుగైన వెట్టింగ్ విధానాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు అధిక రిస్కీ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఖన్నా పేర్కొన్నారు. అమెరికాలోకి అంట్రీ పాయింట్ల వద్ద పరిశీలన తీవ్రతరం అవుతున్నట్లు గమనిస్తున్నామని అన్నారు. జనవరిలో సూచించబడిన ‘తీవ్రమైన వెట్టింగ్’ను తప్పనిసరి చేస్తూ ఇటీవలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ స్పష్టంగా మరింత కఠినమైన తనిఖీలకు, ఎక్కువ ప్రాసెసింగ్ సమయాలకు దారితీసిందని అన్నారు.