అమెరికాలో ఘోరం జరిగింది. భారతీయ విద్యార్థి పై దాడి కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య ఉన్నత చదువులు చదువుతున్నాడు. ఆదివారం ఉదయం నుంచి నఅల్ ఆచార్య కనిపించకుండా పోయాడు. దీంతో తన కొడుకు కనపించడంలేదని నీల్ తల్లి ఎక్స్ లో ట్వీ్ట్ చేసింది.
"మా అబ్బాయి నీల్ ఆచార్య నిన్న జనవరి 28 నుండి తప్పిపోయాడు. అతను USలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతనిని చివరిసారిగా యూబర్ డ్రైవర్ చూసాడు, అతన్ని పర్డ్యూ యూనివర్సిటీలో డ్రాప్ చేశాడు. మేము ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నాము. అతనిపై, దయచేసి మీకు ఏదైనా తెలిస్తే మాకు సహాయం చేయండి," అని తెలిపింది.
ట్వీట్ పై చికాగోలోని కాన్సోలెట్ జనర్ల్ ఆఫ్ ఇండియా స్పందించారు. "కాన్సులేట్ పర్డ్యూ యూనివర్సిటీ అధికారులతో మరియు నీల్ కుటుంబంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. కాన్సులేట్ సాధ్యమైన అన్ని మద్దతు మరియు సహాయాన్ని అందజేస్తుంది". అని తెలిపారు. నీల్ తల్లి ట్వీట్ చేసిన మరుసటి రోజు నీల్ శవమై కనిపించాడని అధికారులు తెలిపారు.
పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది