ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన టీమిండియా స్వదేశానికి వచ్చేసింది. సోమవారం నాడు ముంబై ఎయిర్ పోర్ట్ లో భారత్ కి చేరుకున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తమ కార్లలో ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మరి కొన్ని రోజుల్లో భారత్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 న టీమిండియా మొహాలీ చేరుకోనుంది.
స్క్వాడ్ ని ప్రకటించని భారత్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కి మరో నాలుగు రోజుల సమయం కూడా లేదు. దీంతో రెస్ట్ లేకుండానే రోహిత్ సేన ఆసీస్ తో తలపడేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ సిరీస్ కోసం నిన్న ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించగా..
ALSO READ: సిరాజ్ కు హైదరాబాద్ సలాం.. ప్రముఖుల అభినందనలు
భారత జట్టుని ఇంకా ప్రకటించలేదు. ఈ నెల 22,24,27 తేదీల్లో మొహాలీ, ఇండోర్,రాజ్ కోట్ లో వేదికగా ఈ మూడు వన్డేలు జరుగుతాయి. మరో వైపు ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాపై సిరీస్ కోల్పోయి నేడు భారత్ కి పయనమవుతుంది. మొత్తానికి రెండు జట్లు కూడా రెస్ట్ లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.