బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా జట్లు హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. శుక్రవారం జరిగిన విమెన్స్ సెక్షన్ మూడో రౌండ్‌లో ఇండియా 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలిచింది. ద్రోణవల్లి హారిక తన గేమ్‌లో ఓడినా.. వైశాలి 38 ఎత్తులతో హకీమ్‌ఫార్డ్ గాజల్‌పై గెలిచింది.
దివ్య దేశ్‌ముఖ్ 32 ఎత్తుల వద్ద సోఫియా పై, వంతిక 48 ఎత్తుల్లో మాంకోను ఓడించి జట్టును గెలిపించారు. ఓపెన్ సెక్షన్ లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ వరుసగా మూడో విక్టరీతో మూడో రౌండ్‌లో ఇండియా అబ్బాయిల జట్టు.. హంగేరి బి జట్టును ఓడించింది. ఈ రౌండ్‌లో అర్జున్ 34 ఎత్తుల్లో పీటర్‌పై నెగ్గాడు. గుకేశ్ కూడా తన గేమ్‌లో విజయం సాధించాడు.