- గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో ప్రమాదం
వాషింగ్టన్: స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఇండియన్ టెకీ లోయలోని నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. అమెరికాలో మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. హారాష్ట్రకు చెందిన సిద్ధాంత్ విఠల్ పాటిల్ (26) కాలిఫోర్నియాలో ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 6న తన ఫ్రెండ్స్‌తో కలిసి నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు.
కొండ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారి లోయలో పడ్డాడు. బండరాళ్ల మధ్య ఉన్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పాటిల్ కోసం హెలికాప్టర్ లో గాలించాయి. డ్రోన్ల సాయంతో రేంజర్లు గాలించినా ఆచూకీ తెలియలేదు. పాటిల్ చనిపోయి ఉంటాడని, డెడ్ బాడీ లోయలో రాళ్లు, చెట్ల మధ్య ఇరుక్కుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పాటిల్‌కు చెందిన కొన్ని వస్తువులు దొరికాయని చెప్పారు.