
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్).. చెంగ్డూ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో యూకీ–ఒలివెట్టి 5–7, 6–3, 12–10తో గొంజాలో ఎస్కోబార్–డియాగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలిచారు. తొలి సెట్‌లో ఓడినా తర్వాతి రెండు సెట్లలో ఇండో–ఫ్రెంచ్ ద్వయం అద్భుతంగా పుంజుకుంది.
సెమీస్‌లో యూకీ జంట.. ఇవాండ్ డుడిగ్ (క్రొయేషియా)–రఫెల్ మాటోస్ (బ్రెజిల్)తో తలపడతారు. హాంగ్జౌ ఓపెన్‌లో విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెదుచెలియన్ జోడీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో వీరిద్దరు 6–7 (4), 7–6 (6), 10–8తో జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)పై నెగ్గారు.