
చెన్నై: ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మెన్స్ సింగిల్స్‌లో అత ను బరిలోకి దిగనున్నాడు. ఈ నెల ఆరంభంలో హీల్‌బ్రోన్ చాలెంజర్ టోర్నీ నెగ్గి ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 71వ ర్యాంక్ సాధించడంతో పారిస్ బెర్త్ లభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన నగాల్ రెండోసారి విశ్వక్రీడల బరిలో నిలవనున్నాడు.