కివీస్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్‌కు రెస్ట్

ముంబై: స్వదేశంలో న్యూజిలాండ్‌తో త్వరలో మొదలయ్యే టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. హిట్‌మ్యాన్‌కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. వీరితోపాటు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడని.. రెండో మ్యాచ్‌లో అతడు జట్టులో కలుస్తాడని బోర్డు తెలిపింది. అలాగే రెండో టెస్టు నుంచి టీమ్‌ను విరాట్ నడిపిస్తాడని స్పష్టం చేసింది. ఫస్ట్ టెస్టుకు అజింక్యా రహానె కెప్టెన్‌గా.. నయా వాల్ ఛటేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. 

కివీస్ టూర్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు: అజింక్యా రహానె (కెప్టెన్), ఛటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యస్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. 

మరిన్ని వార్తల కోసం: 

సీఈవోను చెంపదెబ్బ కొట్టే జాబ్.. గంటకు 6 వందల జీతం

వరుసగా మూడోసారి.. పరేడ్‌ను లీడ్‌ చేసిన మహిళా కమాండర్‌‌

ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్.. హైదరాబాద్‌ టూ ఆస్ట్రేలియా స్మగ్లింగ్!