టూమచ్ చేస్తున్నారు : ఇండియా వీసా సెంటర్ మూసివేసిన బంగ్లాదేశ్

టూమచ్ చేస్తున్నారు : ఇండియా వీసా సెంటర్ మూసివేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ దేశంలోని ఇండియా వీసా సెంటర్ ను మూసివేసింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నామని.. ఇప్పటి వరకు ఇండియా వెళ్లటం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రాసెస్ కూడా నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కనీసం పాస్ పోర్టులు కూడా తీసుకోబోమని.. ఇండియన్ వీసా సెంటర్ లోని అన్ని పనులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం.

బంగ్లాదేశ్ లోని నెలకొన్న రాజకీయ అస్థిరత, అల్లరు కారణంగా ఆ దేశంలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ మూసి వేయడింది. ఎప్పుడు తెరుచుకుంటుందని వివరాలు తదుపరి నోటిసుల ద్వారా తెలుపుతామని చెప్తున్నారు. అప్ డేట్స్ కోసం IVAC బంగ్లాదేశ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో చూడాలని తెలిపింది.

ఇండియా ఢాకాలోని హైకమిషన్ కార్యాలయం నుంచి 190 మంది అనవసర సిబ్బందిని ఖాళీ చేయించింది. బంగ్లాదేశ్ లో జరిగుతున్న అల్లర్లు కారణంగా ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ లోని ఇండియన్ వీసా సెంటర్ తాత్కాలికంగా మూసివేశారు. ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ వెబ్‌సైట్‌లో దరఖాస్తుదారులకు అప్డేట్స్ మెస్సేజ్ ఇస్తామని.. పాస్‌పోర్ట్‌లను మరుసటి పని రోజు కలక్ట్ చేసుకోవాలని పాస్ పోర్ట్ ఆఫీస్ తెలిపింది.  దౌత్యవేత్తలందరూ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారని.. మిషన్లు పనిచేస్తున్నాయని విదేశీ మంత్రిత్వ వర్గాలు తెలిపాయి. ఢాకాలోని హై కమీషన్ కాకుండా భారతదేశంలో చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా మరియు సిల్హెట్‌లలో అసిస్టెంట్ హైకమీషన్‌లు లేదా కాన్సులేట్‌లు ఉన్నాయి.