2023 Cyber Attacks: వెబ్సైట్లు,యాప్లపై 5.14 బిలియన్ల సైబర్ దాడులు జరిగాయ్..

2023 Cyber Attacks: వెబ్సైట్లు,యాప్లపై 5.14 బిలియన్ల సైబర్ దాడులు జరిగాయ్..
  • ఆరోగ్యరంగమే కీలక లక్ష్యం

2023 Cyber Attacks: 2023లో భారతీయ వెబ్ సైట్లు, యాప్ లు 5.14 బిలియన్లకు పైగా సైబర్ దాడులకు గురయ్యాయని ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని లక్ష్యంగా ఈ దాడులు జరిగినలట్లు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విలువైన కస్టమర్ డేటాను దొంగిలించడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఈ దాడులు చేసినట్లు వెల్లడైంది. గతం కంటే 2023లో 10 రెట్లు దాడులు పెరిగాయని తేలింది. 

ఇండస్ ఫేస్ నివేదిక ప్రకారం..TCGF II అప్లికేషన్ సెక్యూరిటీ కంపెనీ, రిటైల్ , ఇ-కామర్స్ కంపెనీలు ఎక్కువగా కార్డింగ్ దాడులకు గురియ్యాయి. ఐటీ సేవలు, కన్సల్టింగ్, తయారీ, టెలికమ్యూనికేషన్స్ , మార్కెటింగ్ , అడ్వర్ టైజ్ మెంట్ రంగాలు కూడా కార్డింగ దాడులకు గురయ్యాయి. 

Indusface కు చెందిన AppTrana నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా 6.8 బిలియన్ల సైబర్ దాడులను నిరోధించింది. వాటిలో 5.14 బిలియన్ల భారతీయ సంస్థలు, SME, ప్రభుత్వ రంగ సంస్ధలు లక్ష్యంగా సైబర్ దాడులు జరిగాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన 100 శాతం వెబ్ సైట్లు బోట్ దాడులకు గురైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

బ్యాంకింగ్ ఫైనాన్స్, బీమా రంగం వంటి సంస్థలపై 90 శాతం దాడులు జరిగినట్లు నివేదికలో వెల్లడించింది. ప్రధాన సైబర్ దాడి మూలాలు భారతదేశం కాకుండా యూఎస్, యూకే, రష్యా, జర్మనీ , సింగపూర్ లలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.