Rishabh Pant: రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం.. లారస్ అవార్డుకు నామినేట్

Rishabh Pant: రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం.. లారస్ అవార్డుకు నామినేట్

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక లారస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన పంత్.. దాని నుంచి కోలుకుని తిరిగి క్రీడల్లోకి రావడాన్ని గుర్తిస్తూ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read :- ప్లేయింగ్ 11లో వరుణ్,మెక్‌గుర్క్.. భారత్, ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే!

లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల వేడుక 2025, ఏప్రిల్ 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరగనుంది. ఆరోజు విజేతలను ప్రకటిస్తారు. పంత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో ఐదుగురు ఈ అవార్డు రేసులో ఉన్నారు. విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు.

లారస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్లు

  • రిషభ్ పంత్ (భారత క్రికెటర్)
  • రెబెకా ఆండ్రేడ్ (బ్రెజిలియన్ జిమ్నాస్ట్)
  • అరియార్నే టిట్మస్ (ఆస్ట్రేలియన్  స్విమ్మర్) 
  • కేలెబ్ డ్రెస్సెల్ (అమెరికన్ స్విమ్మర్)
  • మార్క్ మార్క్వెజ్ (స్పానిష్ బైక్ సైకిల్ రేసర్)
  • లారా గట్-బెహ్రామి (స్విస్ ఆల్పైన్ స్కీ రేసర్)