వెల్లింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్(41) న్యూజిలాండ్ మంత్రిగా నియమితులయ్యారు. ఆ దేశ మంత్రి అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. ఇండియాలో జన్మించిన ప్రియాంక సింగపూర్, న్యూజిలాండ్ లలో చదువుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆక్లాండ్ లో భర్తతో కలిసి ఉంటున్నారు. ప్రియాంక తొలిసారి లేబర్ పార్టీ తరఫున 2017లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టింది. కొత్త కేబినెట్ లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐదుగురికి అవకాశం కల్పించారు. ప్రియాంక సహా మరో నలుగురి పేర్లను సోమవారం ప్రకటించారు. వీరు శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ తర్వాత తొలి కేబినెట్ మీటింగ్ ఉంటుందని జెసిండా తెలిపారు.
For More News..