మలేషియాలో మ్యాన్ హోల్లో పడి ఓ తెలుగు మహిళ గల్లంతయ్యింది. నడుచుకుంటూ వెళ్తుండగా ఫుట్ పాత్ ఒక్కసారిగా కుంగిపోవడంతో మ్యాన్ హోల్ లో పడిపోయింది. గమనించిన స్థాని కులు ఆమెను వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. మ్యాన్ హోల్ నీటిలో కొట్టుకుపోయింది.. స్థానిక అధికారులు ఆమె ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మలేషియాలోని కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ మ్యాన్ హోల్లో గల్లంతయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన తెలుగు మహిళ విజయలక్ష్మి (45) గత కొంత కాలంగా కౌలాలంపూర్లో నివాసం ఉంటోంది. విజయలక్ష్మీ పనిలో భాగాంగా కౌలాలంపూర్ ఆమె నివాసం ఉంటున్న బజార్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఫుట్ పాత్ కుంగిపోయింది..
తో ఆమె 10 మీటర్ల లోతైన మ్యాన్ హోల్ లో పడిపోయింది. స్థానికులు, అధికారులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయలక్ష్మీ కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.