మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో వరద నీటిలో చిక్కుకొని మన దేశానికి చెందిన యువతి(28) మృతి చెందింది. క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని మౌంట్ ఇసా సమీపంలో గల మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి తన కారులో శవమై కనిపించిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఫాస్ఫేట్ హిల్‌లోని ఇన్సిటెక్ పివోట్ లిమిటెడ్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తుందని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు.
రోడ్డుపై చేరిన నీటిలో నుంచి వెళ్లడంతోనే కారు వరద నీటిలో మునిగిపోయి ఆ యువతి మరణించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అవసరమైన సహాయం కోసం తమ టీమ్అక్కడి అధికారులకు టచ్‌లో ఉందని కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ తెలిపింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.