యూఎస్ సర్కార్‌‌‌‌పై ఇండియన్ మహిళ కేసు

వర్క్ పర్మిట్ కార్డు ఇస్తలేరని కేసు

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు తనకు వర్క్ పర్మిట్ కార్డును ఇస్తలేరంటూ ఓ ఇండియన్ మహిళ ఆ దేశ సర్కార్ పై కేసు వేశారు. తనకు హెచ్4 స్టేటస్ పొడిగింపుతో పాటు ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కార్డును ఏప్రిల్ 7న అధికారులు అప్రూవ్ చేసినా, ఇప్పటివరకూ ఆ కార్డు అందలేదని రంజిత సుబ్రమణ్య ఈ మేరకు తన లా సూట్లో తెలిపారు. కార్డు లేకపోవడం వల్ల తాను ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు సుమారు 75 వేల ఈఏడీ కార్డులను ప్రింట్ చేయకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. రంజిత భర్త వినోద్ సిన్హా హెచ్1బీ వర్క్ వీసాపై అమెరికాలో ఉన్నారు. రంజిత హెచ్
4 డిపెండెంట్ వీసాతో ఈఏడీ కార్డు పొంది ఉద్యోగం చేస్తున్నారు. ఆ కార్డు జూన్ 7న ఎక్స్ పైర్ అయింది. కొత్త కార్డు అప్రూవ్ అయినా అధికారులు ప్రింట్ ఇవ్వలేదు. ఆగస్టు 9లోగా కొత్త కార్డు చూపకపోతే.. ఉద్యోగంలోంచి తీసేస్తామని ఆమెకు జాబ్ ఇచ్చిన సంస్థ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమె ఓహియోలోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు.

For More News..

అవసరమైతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం..