
అంటాల్యా: ఆర్చరీ వరల్డ్ కప్‌లో ఇండియా ఆర్చర్ల గురి అదిరింది. వెన్నం జ్యోతి సురేఖ–అదితి స్వామి–పర్నీత్ కౌర్‌తో కూడిన ఇండియా టీమ్ వరుసగా మూడో వరల్డ్ కప్‌లోనూ గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ ఫైనల్లో జ్యోతి బృందం 232–229తో ఈస్టోనియా త్రయం లిసెల్ జాత్మా–మీరి మారిటా పాస్–మారిస్ టెట్స్‌మన్‌పై గెలిచింది.
దీంతో ఈ సీజన్‌లో షాంఘై (ఏప్రిల్), యెచియోన్ (మే)లో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్–1, 2లోనూ గోల్డ్ నెగ్గిన ఇండియా టీమ్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. మెన్స్ కాంపౌండ్‌లో ప్రియాన్షు సిల్వర్ మెడల్ నెగ్గాడు. ఇండివిడ్యువల్ ఫైనల్లో ప్రియాన్షు 148–149తో మైక్ ష్లోసెర్ (డచ్) చేతి లో ఓడి వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. డచ్ ఆర్చర్ చేతిలో ప్రియాన్షు ఓడటం ఇది రెండోసారి. ఆదివారం జరిగే రికర్వ్ పోటీల్లో ఇండియా మూడు మెడల్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది.