హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్.. చరిత్ర సృష్టించిన భారత మహిళలు

హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్.. చరిత్ర సృష్టించిన భారత మహిళలు

వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా మూడు ప్రపంచకప్ గోల్డ్ మెడల్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. శనివారం(జూన్ 22) టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 3 ఫైనల్లో భారత ఆర్చరీ త్రయం.. ఎస్టోనియాకు చెందిన లిసెల్ జాత్మా, మరిటా పాస్, మారిస్ టెట్స్‌మన్‌లను 232-229 తేడాతో ఓడించింది. 

గతంలో షాంఘై, యెచియోన్‌లలో వరుసగా స్టేజ్ 1 మరియు 2లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ కప్‌లో ఇది వారికి వరుసగా మూడో బంగారు పతకం. ఈ విజయంతో భారత మహిళల ఆర్చరీ జట్టు ప్రపంచ నం.1 ర్యాంకును కైవసం చేసుకుంది.