పురుషుల కంటె మహిళలకే ఒత్తిడి ఎక్కువ

దేశ వ్యాప్తంగా మానసికంగా బాధ పడే వారి గురించి ఓ సంస్థ​అధ్యయనం చేసింది.  యువర్​ దోస్ట్​ అనే సంస్థ  ఎమోషనల్ వెల్‌నెస్ స్టేట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే పేరుతో చేసిన సర్వేలో దేశంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువుగా మానసికంగా ( మెంటల్​) బాధపడుతున్నారని  తేలిందని  వెల్లడించింది. దేశంలో ఉద్యోగం చేసే 5 వేల మందిని సర్వే చేసినట్లు ఆ నివేదికలో పేర్కొంది. మగవారితో పోలిస్తే ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఎక్కువుగా ఒత్తిడికి గురవుతున్నారని  సర్వే ప్రతినిథులు తెలిపారు.  సర్వే చేసినవారిలో 72.2 శాతం మహిళలు ఇబ్బంది పడుతున్నారని.. పురుషులను అవే ప్రశ్నలు అడుగగా 53.64 శాతం మంది మాత్రమే మెంటల్​ టెన్షన్​ పడుతున్నారని తెలిపారు. 
 
పని విషయంలో సమతుల్యత పాటించే విషయంలో 12 శాతం మంది పురుషులు.. 18 శాతం మంది మహిళలు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులు పడుతున్నారు.  మహిళల్లో ఒత్తిడికి కారణాలు పేర్కొంటూ.. గుర్తిపు లేకపోవడం.. తోటి ఉద్యోగులతో కలవలేకపోవడం.. ప్రతి దానికి భయపడటం.. ఏ పని చేస్తే ఏమవుతుందో అని  అనుమానంగా ఉండటం వంటి వాటిలో 9.27 శాతం మంది పురుషులతో పోలిస్తే 20 శాతం మంది మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు  తమ సర్వేలో వెల్లడైందని యువర్​ దోస్త్​తెలిపింది. 


ఉద్యోగుల ఎమోషనల్ వెల్‌నెస్ స్టేట్" నివేదిక ప్రకారం 21నుంచి  30 సంవత్సరాల  మధ్య ఉన్న   64.42 శాతం మహిళా ఉద్యోగులు ,  కార్మికులు అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు.  31 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న కార్మికులు 59.81 శాతం,  41 నుంచి 50 సంవత్సరాల లోపు వారు 53.5 శాతం మంది ఎక్కువ టెన్షన్​ కు గురవుతున్నారని నివేదికలో తెలిపింది.  వర్క్​ ప్లేస్​ లో మార్పు.. రిమోట్ ,  హైబ్రిడ్ వర్క్ మోడల్స్21-నుంచి 30 ఏళ్ల జనాభాపై ప్రభావం చూపుతుందని ఉద్యోగుల ఎమోషనల్ వెల్‌నెస్ స్టేట్ నివేదిక ద్వారా తెలుస్తోంది.   ఐటీ సెక్టార్​, ట్రాన్స్​పోర్ట్​, మీడియా, బిజినెస్​ ఇంకా  కొన్ని రంగాల ఉద్యోగులను సర్వే చేశారు.