
సిల్హెట్ (బంగ్లాదేశ్): డబ్ల్యూపీఎల్ తర్వాత బరిలోకి దిగిన తొలి ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ శుభారంభం చేసింది. పేసర్లు రేణుకా సింగ్ (3/18), పూజా వస్త్రాకర్ (2/25) సత్తా చాటడంతో బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 145/7 స్కోరు చేసింది. యాస్తికా భాటియా (36), షెఫాలీ వర్మ (31), హర్మన్‌ప్రీత్ (30), రిచా ఘోశ్ (23) రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేనా ఖాన్ మూడు, మరూఫా అక్తర్ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 101/8 స్కోరు చేసి ఓడిపోయింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (51) ఫిఫ్టీతో పోరాడినా ఫలితం లేకపోయింది. రేణుకా సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.