
పెర్త్: ఆస్ట్రేలియా టూర్‌ను ఇండియా విమెన్స్ హాకీ టీమ్ ఓటమితో ఆరంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా 3–5తో ఆస్ట్రేలియా–ఎ చేతిలో పరాజయం చవిచూసింది. మహిమా టెటే (21వ ని), నవ్‌నీత్ కౌర్ (45వ ని), లాల్‌రెమిసియామి (50వ ని) ఇండియాకు గోల్స్ అందించగా, ఆసీస్ తరఫున నీసా ప్లైన్ (3వ ని), ఒలివియా డౌన్స్ (9వ ని), రూబీ హ్యారిస్ (11వ ని), టాటుమ్ స్టీవార్ట్ (21వ ని), కెండ్రా ఫిట్జ్‌ప్యాట్రిక్ (44వ ని) గోల్స్ కొట్టారు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కంగారూలు మూడో నిమిషంలోనే గోల్ కొట్టి ఇండియా డిఫెన్స్ ఒత్తిడిలో పడిపోయింది. దీన్ని సద్వినియోగం చేసుకుని మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు ఫీల్డ్ గోల్స్ చేసి 3–0తో తొలి క్వార్టర్‌ను ముగించారు. రెండో క్వార్టర్‌లోనూ అదే జోరును కొనసాగించినా మహిమ ఫీల్డ్ గోల్డ్‌తో ఇండియా 1–4తో హాఫ్ టైమ్‌ను ముగించింది. రెండో భాగంలో కొద్దిగా తేరుకున్న ఇండియా ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టింది.
కానీ ఆసీస్ స్ట్రయికర్ ఫిట్జ్‌ప్యాట్రిక్ ఐదో గోల్ అందించడంతో ఆధిక్యం భారీగా పెరిగింది. దీన్ని సమం చేయడానికి ఇండియా ఫార్వర్డ్స్ ఎదురుదాడులు చేసినా కంగారులు బలమైన డిఫెన్స్‌తో అడ్డుకట్ట వేశారు. పహల్గాం ఉగ్రదాడికి సంతాపంగా ఈ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లు బ్లాక్ ఆర్మ్‌బాండ్స్ ధరించారు. మిగతా మ్యాచ్‌ల్లోనూ దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది.