ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత మహిళా జట్టు అవతరించింది. బుధవారం(నవంబర్ 20) జరిగిన ఫైనల్లో భారత్ 1-0తో చైనాతో ఓడించి టైటిల్ చేజిక్కించుకుంది. ఫామ్‌లో ఉన్న దీపికా సెహ్రావత్ మూడో క్వార్టర్‌లో ఏకైక గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపింది. ఆసియా హాకీ టోర్నీలో భారత మహిళా జట్టు టైటిల్ గెలవడం ఇది మూడోసారి. గతంలో 2016, 2023లో టైటిల్ గెలుచుకుంది.
ఓటమన్నదే లేదు
ఈ టోర్నీలో భారత మహిళల జట్టుకు ఓటమన్నదే లేదు. చైనాపై 3-0 విజయంతో సహా గ్రూప్-స్టేజులో ఐదింటిలో విజయం సాధించింది. ఆపై సెమీ-ఫైనల్లో జపాన్‌ను 2-0తో ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇప్పుడు ఆఖరి మెట్టుపై డ్రాగన్ దేశాన్ని బోల్తా కొట్టించి టైటిల్ నిలుపుకుంది.
🏆 Champions Again! 🇮🇳🔥
— Hockey India (@TheHockeyIndia) November 20, 2024
Team India clinches the Bihar Women’s Asian Champions Trophy Rajgir 2024 title with a stellar 1-0 victory over China! 🎉💪 The defending champions have shown their grit, skill, and determination, proving once again why they are on top of Asia.
Another… pic.twitter.com/RkCxRI2Pr2
🎉 What a performance! Deepika has been unstoppable at the Bihar Women’s Asian Champions Trophy 2024, earning the Player of the Match and finishing as the top scorer! 🏑🔥 Her dedication and skill are shining bright, leading the charge for the team.
— Hockey India (@TheHockeyIndia) November 20, 2024
Let's keep the momentum… pic.twitter.com/PCrW75K7cX