ఆసియా టీటీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో..తొలిసారి కాంస్య పతకం

ఆసియా టీటీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో..తొలిసారి కాంస్య పతకం

ఆస్తానా (కజకిస్తాన్‌‌‌‌) : ఆసియా టీటీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో.. ఇండియా విమెన్స్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ టీమ్‌‌‌‌ తొలిసారి కాంస్య పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 1–3తో జపాన్‌‌‌‌ చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ 92వ ర్యాంకర్‌‌‌‌ ఐహిక ముఖర్జీ 2–3తో మివా హరిమోటో చేతిలో పోరాడి ఓడింది. రెండో సింగిల్స్‌‌‌‌లో మనికా బాత్రా 3–0తో సత్సుకి ఒడోపై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాతి మ్యాచ్‌‌‌‌లో సుతీర్థ ముఖర్జీ 0–3తో మిమా ఇటో చేతిలో, మనికా 1–3తో హరిమోటో చేతిలో ఓడటంతో ఇండియాకి ఓటమి తప్పలేదు. 

అప్పటికే జపాన్‌‌‌‌ 3–1 లీడ్‌‌‌‌లో నిలవడంతో ఐహిక ముఖర్జీ.. సత్సుకి మధ్య ఆఖరి మ్యాచ్‌‌‌‌ను నిర్వహించలేదు. మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ కూడా వరుసగా మూడోసారి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను ఖాయం చేసుకుంది. క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఇండియా 3–1తో కజకిస్తాన్‌‌‌‌పై నెగ్గింది. మానవ్‌‌‌‌ ఠక్కర్‌‌‌‌ 3–0తో కిరిల్‌‌‌‌ గెరాసిమెంకోపై గెలవగా, హర్మిత్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ 0–3తో అలాన్ చేతిలో ఓడాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ 3–0తో ఐడోస్‌‌‌‌ కెంజిగులోవ్‌‌‌‌పై, హర్మిత్‌‌‌‌ 3–2తో కిరిల్‌‌‌‌ గెరాసిమెంకోపై నెగ్గారు.