
న్యూఢిల్లీ: ఇండియా రెజ్లర్ సునీల్ కుమార్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన మెన్స్ 87 కేజీల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్‌లో సునీల్ 3–1తో జియాక్సిన్ హుయాంగ్ (చైనా)పై నెగ్గాడు. ఇండియా రెజ్లర్‌కు ఇది ఐదో ఆసియా చాంపియన్ మెడల్ కావడం విశేషం. గతంలో ఒక గోల్డ్, ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ నెగ్గాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సునీల్ 10–-1తో సుకురోబ్ అబ్దుల్‌ఖేవ్ (తజకిస్తాన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. కానీ సెమీస్‌లో 1–3తో యాసిన్ అలీ యాజ్డి (ఇరాన్) చేతిలో ఓడాడు.
అయితే యాజ్డి ఫైనల్‌కు చేరడంతో సునీల్‌కు బ్రాంజ్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడే చాన్స్ లభించింది. ఇక, 77 కేజీ క్వార్టర్స్‌లో సాగర్ 0–10తో అమ్రో సదేహ్ (జోర్డాన్) చేతిలో ఓడాడు. ఉమేశ్ (63 కేజీ), నితిన్ (55 కేజీ), ప్రేమ్ (130 కేజీ) క్వాలిఫికేషన్ రౌండ్లలోనే వెనుదిరిగారు.