
సెయింట్ లూసియా (అమెరికా): ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఘోరంగా ఫెయిలయ్యాడు. మూడు పరాజయాలు, మూడు డ్రాలతో ఏడో రౌండ్ మొదలుపెట్టిన ప్రజ్ఞానంద.. ఏడో రౌండ్‌లోనూ నిరాశపర్చాడు. లినియెర్ డొమింగ్వేజ్ (అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. తర్వాత అలీరెజా ఫిరౌజ్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్‌ను డ్రాగా ముగించాడు. ఓవరాల్‌గా 18 పాయింట్లకు గాను నాలుగు పాయింట్లే నెగ్గిన ప్రజ్ఞానంద పదో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.
బ్లిట్జ్ సెక్షన్‌లో రాణిస్తే ఈ టోర్నీలో ఇండియా ప్లేయర్ పుంజుకునే చాన్స్ ఉంది. ఓవరాల్‌గా ఇయాన్ నెపోమినెట్చి (రష్యా), అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్), మాక్సిమ్ వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) తలా 11 పాయింట్లతో టాప్–3లో నిలిచారు. లెవోన్ అరోనియన్ (ఆర్మేనియా), లినియెర్ డొమింగ్వేజ్, వెస్లీ సో (అమెరికా) చెరో పది పాయింట్లతో తర్వాతి ప్లేస్‌లను సాధించారు. హికర్ నకమురా (జపాన్), కరువాన (అమెరికా), నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.