న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద.. మెల్ట్‌వాటర్ చాంపియన్స్ చెస్ టూర్ చేసెబుల్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన సెమీస్ లో చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 1.5- 0.5 తేడాతో డచ్ గ్రాండ్ మాస్టర్ ఆనిష్ గిరిని చిత్తు చేశాడు. సెమీస్ లో జరిగిన మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక రెండో గేమ్ లో ప్రజ్ఞానంద గెలిచారు. ఇక మూడో గేమ్ మళ్లీ డ్రాగా ముగిసింది. ఇక నాలుగో మ్యాచ్ లో ఆనిష్ గిరి విజయం సాధించాడు. దీంతో 5వ మ్యాచ్ గా జరిగిన టై బ్రేకర్ లో ప్రజ్ఞానంద డచ్ ఆటగాడిని ఓడించి తిరుగులేని విజయం సాధించాడు.
Chessable Masters 2022: India's R Praggnanandhaa storms into the final, stuns Dutch GM Anish Giri in tie-breaker in SF
— ANI Digital (@ani_digital) May 25, 2022
Read @ANI Story | https://t.co/2TmeYoCzqu#Praggnanandhaa #Chess #ChessableMasters2022 pic.twitter.com/jnaRTqJzwU
దీంతో ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన మొదటి ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డ్ నెలకొల్పాడు. వరల్డ్ వరల్డ్ నెంబర్ టూ ఆటగాడు డింగ్ లిరెన్ తో ప్రజ్ఞానంద ఫైనల్లో తలపడనున్నాడు. ఇక భారత్ నుంచి పోటీలో పాల్గొన్న హరికృష్ణ, విదిత్ గుజరాతీ నాకౌట్ చేరకుండానే తిరుగుముఖం పట్టారు.
మరిన్ని వార్తల కోసం...