
హైదరాబాద్ సిటీ, వెలుగు: పదిహేనేండ్ల కింద జీహెచ్ఎంసీతో ‘సిస్టర్ సిటీ ఒప్పందం’ చేసుకున్న అమెరికాకు చెందిన ఇండియనా స్టేట్ ప్రతినిధుల బృందం బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసింది. పాఠశాల విద్య అభివృద్ధికి సహకరించాలని మేయర్ వారిని కోరారు. ఇండియానా పోలీస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియాగో మోరల్స్, చీఫ్ అడ్వైసర్ ఆఫ్ గ్రోత్ అండ్ స్ట్రాటజీ చింతల రాజు పాల్గొన్నారు.