మన బుర్రకెక్కేది అబద్ధమేనా..! : రోజుకు 12 ఫేక్ మెసేజీలు చదువుతాం

మన బుర్రకెక్కేది అబద్ధమేనా..! : రోజుకు 12 ఫేక్ మెసేజీలు చదువుతాం

మీకు ఈ విషయం తెలుసా..? ఇది నిజంగా షాకింగ్ న్యూసే..మొబైల్ యూజర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సగటున రోజుకు 12 ఫేక్ మేసేజ్ లు అందుకున్నారు. సోషల్ మీడియా, ఈ మెయిల్స్, టెక్స్ట్ ల ద్వారా ఈ ఫేక్ మేసేజ్ లు ఫార్వార్డ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మేసేజ్ లు నిజమా.. అబద్ధమా అని తనిఖీ చేసుకోవడం, సమీక్షించడం, అర్థం చేసుకోవడం కోసం సగటున రోజుకు 1.8 గంటలు ఈ మేసేజ్ లకే సమయం కేటాయిస్తున్నాం.  గ్లోబల్ స్కాం మేసేజ్ లపై ఇటీవల జరిపిన సర్వేల్లో  తేలిందేంటంటే.. 82 శాతం భారతీయులు ఈ ఫేక్ మేసేజ్ ల ట్రాప్ లో పడుతున్నారు. 49 శాతం మంది మాత్రం అది ఫేక్ మేసేజ్ అని గుర్తించడం కష్టతరం అని చెప్పారు.   

ఏఐ ద్వారా నకిలీ జాబ్ నోటిఫికేషన్లు 

అత్యంత సాధారణమైన, ట్రెండింగ్ లో ఉన్న స్కామ్ ట్రిక్ లలో ఒకటి వినియోగదారులకు జాబ్ నోటిఫికేషన్లు పంపించడం. ఆఫర్లకోసం ఎగబడే భారతీయ వినియోగ దారులు ఎదుర్కొంటున్న అత్యంత సాధరాణ స్కామ్ లలో ఇది ఒకటి. 64 శాతం మంది మొబైల్ యూజర్లు ఈ స్కామ్  బాధితులుగా ఉన్నారని సర్వేలో తేలింది. మరొక స్కామ్ ట్రిక్ బ్యాంక్ అలెర్ట్ మేసేజ్ లు. ఈ స్కామ్ ట్రిక్ ద్వారా 52 శాతం మంది వినియోగదారులు మోసపోతున్నట్లు సర్వేలు తేల్చాయి. 

స్కామ్  చేసేందుకు AI ని వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు 

సైబర్ నేరగాళ్లు స్కామ్ చేసేందుకు AI ని ఎలా ఉపయోగిస్తున్నారు.. ఎలా స్కామ్ సందేశా పంపుతున్నారు.. తెలుసుకోవడం కోసం భారత్ తో సహా ఏడు దేశాల నుంచి 7వేల మంది యూజర్లపై అధ్యయనం చేశారు ఈ సర్వేల్లో. ఇది AI ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల జీవితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని తేలింది. 

ఏడాది మొత్తం స్కామ్ టెక్ట్స్ లు , మేసేజ్ లతో మోసం పోవడం జరుగుతుందని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి కారణమని.. పంపబడిన టెక్ట్స్ మేసేజ్ లేదా బ్యాంక్ అలెర్ట్ నోటిఫికేషన్లు నిజమా లేక నకిలీదా అనే తెలుసుకోవడం చాలా కష్టమని సర్వేల్లో తేలింది.