రష్యా సైన్యంలో ఉన్న భారతీయులు విడుదలయ్యారని భారత విదేశంగా మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీని పై స్పందించిన విదేశాంగ శాఖ మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువచ్చింది.
న్యూఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయంతో సంప్రదించి అనేక మంది భారతీయులను రష్యా సైన్యం నుంచి విడిపించామని ప్రకటించింది. మోసపూరిత ట్రావెల్ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని ఇతర దేశాల్లో వివాదాలకు దూరంగా ఉండాలని విదేశాంగ శాఖ భారతీయులకు సూచించింది. రష్యా సైన్యంలోని భారతీయ పౌరులకు సంబంధించిన అన్ని సంబంధిత కేసులను రష్యన్ అధికారులతో మాట్లాడి సెటిల్ చేస్తామని ప్రకటించింది.
కొన్ని రోజుల కిందట డజన్ల కొద్దీ భారతీయులకు రష్యన్ ఆర్మీలో ఉన్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఒక భారతీయుడి కూడా ఉన్నాడని వారిని విడిపించి తీసుకరావాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
MEA on Indians in the Russian Army:
— Sidhant Sibal (@sidhant) February 26, 2024
-Each & every such case brought to the attention of the Indian Embassy in Moscow has been strongly taken up with the Russian authorities
-Several Indians have already been discharged as a result pic.twitter.com/r8dXteknDw