ఇంత దోచేశారా : మూడేళ్లలో.. సైబర్ క్రైం ద్వారా 25 వేల కోట్లు మోసపోయిన జనం

ఇంత దోచేశారా : మూడేళ్లలో.. సైబర్ క్రైం ద్వారా 25 వేల కోట్లు మోసపోయిన జనం

సైబర్ మోసాలు.. సైబర్ మోసాలు.. అని రోజు పోలీసులు చెబుతున్న వినకుండా జగ్రత్త పడటం లేదు భారతీయులు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేద్దామని సోషల్ మీడియాలో వచ్చే వన్ని నమ్మకండని వార్తలు రాసిన మాకేం సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు పౌరులు.. ఔను మరి.. కోటి కాదు.. పది కోట్లు కాదు.. వంద.. వెయ్యి కోట్లు కాదు.. ఏకంగా రూ. 25 వేల కోట్లు.. ఇదంతా భారతీయులు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన డబ్బు..  ఈ డబ్బంతా మోసపోయింది ఐదేళ్లలోనో లేక పదేళ్లలోనో అనుకునేరు.. అస్సలు కాదు.. కేవలం మూడెళ్లలోనే..  ఇది సిక్కిం వార్షిక బడ్జెట్ కంటే రెట్టింపు.

 రూ. 25 వేల కోట్లంటే సిక్కిం వార్షిక బడ్జెట్ కంటే రెట్టింపు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు Instagram, WhatsApp మరియు Google వంటి వివిధ సోషల్ మీడియా మధ్యవర్తులతో ఆందోళనలను పంచుకున్నారు.గత మూడేళ్లలో సైబర్ మోసాల్లో రూ.25,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమావేశంలో అంచనా వేశారు. 

గత ఏడాది మాత్రమే సైబర్ మోసాలకు సంబంధించి సగటున రోజుకు 27 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జనవరి 2024 నుండి జూన్ 2024 వరకు, సెంట్రల్ సైబర్ ఫ్రాడ్ ఏజెన్సీకి 709 ఫిర్యాదులు అందాయని, అందులో బాధితులు రూ. 1 కోటి కంటే ఎక్కువ నష్టపోయారని, మొత్తం రూ. 1,421 కోట్ల నష్టం జరిగిందని డేటా వెల్లడించింది.
 
ప్రభుత్వ డేటా ప్రకారం, సైబర్ మోసం కేసుల్లో మొత్తం అరెస్టులు..  మొత్తం కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు 66,000 పైగా ఉన్నాయని అధికారిక డేటా సూచిస్తుంది, అయితే ఈ సంవత్సరం వరకు కేవలం 500 మంది అరెస్టులు జరిగాయి.