అలెక్సా.. ప్లే హనుమాన్‌ చాలీసా

అలెక్సా.. ప్లే హనుమాన్‌ చాలీసా

గతేడాది నిమిషానికి నాలుగు సార్లు పెట్టిన రిక్వెస్ట్​ ఇదే

అమెజాన్‌, సిరి లాంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయాయి. పాటలు ప్లే చేయమనడం దగ్గర్నుంచి టీవీని స్టార్ట్‌ చేయడం వరకు రకరకాల పనులకు ఈ టూల్స్‌ వాడేస్తున్నారు . మార్కెట్ లోకి చాలా రకాల ఏఐ డివైస్ లు వచ్చినా వాటిల్లో అలెక్సానే జనాలు బాగా వాడుతున్నారు . మంచి మ్యూజిక్‌ క్వాలిటీ వస్తుందని అలెక్సాకు పేరుంది. గతేడాది నిమిషానికి వెయ్యి మంది యూజర్లు పాటలు ప్లే చేయమని అలెక్సాను కోరారంట. మరి గతేడాది ఎక్కువసార్లు రిక్వెస్ట్‌ చేసిన పాటేమయుంటుంది? అంటే హనుమాన్‌ చాలీసా. నిమిషానికి 4 సార్ల కన్నా ఎక్కువగా యూజర్లు చాలీసాను ప్లే చేయమన్నారు. తర్వాతి స్థా నంలో ‘బేబీ షార్క్‌’ ఉంది. ఈ పాటను నిమిషానికి మూడుసార్లు అడిగారు. మూడో ప్లేస్ లో పంజాబీ పాట ‘లాంబొర్గిని’ నిలిచింది. అడిగిన పనులన్నీ చేసి పెడుతున్న అలెక్సాకు గతేడాది చాలా మందే ‘ఐ లవ్‌ యూ’ చెప్పారట. గతేడాది నిమిషానికోసారి‘లవ్‌ యూ అలెక్సా’ అన్నారట. రెండు నిమిషాల కోసారి ‘విల్‌ యు మ్యారీ మీ’ అని అడిగారట. కేవలం పని చేయమనే అలెక్సాను అడగట్లేదు. దాని బాగోగులు కూడా కొందరు అడుగుతున్నారు.