ఈ నెల ప్రారంభంలో సిరియా రాజధాని డమాస్కస్‌లోని మాజీ కాన్సులేట్‌పై దాడి చేసిన తరువాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ యొక్క పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన కమాండోలు శనివారం (ఏప్రిల్ 13)న హెలికాప్టర్ ద్వారా హార్ముజ్ జలసంధి సమీపంలో ఓడపై దాడి చేశారు. ముంబైలోని న్హవా షెవా పోర్టుకు చేరుకోవాల్సిన ఓ కార్గోషిప్ ను ఇరాన్ ఐజాక్ చేసింది. MSC ARIES అనే ఓడ గల్ఫ్ ఆఫ్ హార్ముజ్‌లో ఇరాన్ స్వాధీనం చేసుకుంది.
అందులో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది ఇండియన్స్ ఉన్నారు. MSC ఏరీస్ పోర్చుగీస్ ఫ్లాగ్ మరియు ఇజ్రాయెల్ అనుబంధ వాణిజ్య నౌక. ఇండియన్స్ తోపాటు ఫిలిపినోలు, పాకిస్థానీయులు, ఒక రష్యన్, ఒక ఎస్టోనియన్ సిబ్బంది అందులో ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వం స్పందించి ఇరాన్‌తో చర్చలు జరుపుతుంది. షెడ్యూల్ ఏప్పిల్ 15న MSC ఏరీస్ ముంబైకి చేరుకోవాలి.
ఇరు దేశాల రాయబారుల కార్యాలయాలు టెహ్రాన్, ఢిల్లీలో దౌత్య మార్గాల ద్వారా ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. త్వరలోనే ఇండియన్స్ ను విడుదల చేయించడానికి చర్చలు చేపట్టామని తెలిపారు.