
- ఇండియన్ ప్రతిభావంతులు కెనడా వెళ్లిపోతున్నరు
- అమెరికా లామేకర్లకు చెప్పిన ఎక్స్‌పర్టులు
వాషింగ్టన్: కాలం చెల్లిన హెచ్1బీ వీసా విధానంవల్ల అమెరికాకు దూరమవుతున్న భారతీయ ప్రతిభావంతులు ఇప్పుడు కెనడా వైపు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతున్నారని యూఎస్ లామేకర్లకు ఇమిగ్రేషన్, పాలసీ ఎక్స్‌పర్టులు చెప్పారు. గ్రీన్ కార్డు జారీ విషయంలో దేశాలకు కోటా విధానం అమలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని తెలియజేశారు. ఇండియన్లు అమెరికా నుంచి కెనడాకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ వేగంగా స్పందించాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట్ అండర్సన్ చెప్పారు. హౌస్ జ్యుడీషియరీ కమిటీ సబ్ కమిటీ ఆన్ ఇమ్మిగ్రేషన్, సిటిజన్‌షిప్ ముందు ఆయన నివేదించారు. ‘కాలం చెల్లిన యూఎస్ ఇమిగ్రేషన్ పాలసీలు ఇతర దేశాల్లో ప్రతిభావంతులను ఎలా పెంచుతాయి’ అనే అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ స్టూడెంట్లతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ పౌరులు అమెరికాకంటే ఎక్కువగా కెనడాను ఎన్నుకుంటున్నారని వివరించారు.