యూఎస్ లో నివసించేందుకు ఇండియన్స్ ఎంతలా తాపత్రయ పడతారో చెప్పే ఒక ఘటన గురించి తెలుసుకున్నాక అక్రమ వలస దారుల సంఖ్యను గురించి చర్చిద్దాం. 19 జనవరి, 2022లో జగదీశ్ పటేల్ (39)-వైశాల్ బెన్ (37) దంపతులు వారి పిల్లలు విహంగి(11), ధార్మిక్(3) లతో కలిసి అమెరికా-కెనడా బార్డర్ లో గడ్డకట్టుకుపోయి చనిపోయారు. యూఎస్ బార్డర్ కు సరిగ్గా 39 ఫీట్ల దూరంలో కెనడాలోని ఎమర్సన్ టౌన్ వద్ద చనిపోయిన ఘటన అప్పట్లో ప్రపంచాన్ని కదిలించింది. వీసా లేకుండా అనధికారికంగా వెళ్తున్న 11 మందిలో ఈ కుటుంబం కూడా ఒకటి. అమెరికాలోకి ప్రవేశించేందుకు చావును కూడా లెక్క చేయరు అనే విషయం ఈ ఘటన ఆధారంగా తెలుస్తోంది.
ఎంత రిస్క్ చేసైనా సరే అమెరికాలో సెటిలై పోదాం అనే వారిలో ఇండియన్సే టాప్ లిస్టులో ఉన్నారని యూఎస్ విడుదల చేసిన తాజా నివేధిక ఆధారంగా తెలుస్తోంది. అయితే యూఎస్ బార్డర్లో.. చెక్ పాయింట్స్లో పట్టుబడిన అక్రమ వలసదారుల్లో ఇండియన్సే టాప్ లో ఉన్నారు. ఆసియా ఖండం నుంచి వెళ్లిన అక్రమ వలసదారుల్లో పట్టుబడిన వారిలో భారతీయులే అధికం అని తాజాగా వెలువరించిన అధ్యయనం ద్వారా తెలిసింది.
ALSO READ | డాలర్ ఆధిపత్యమే ట్రంప్ లక్ష్యం!
2024 ఆర్థిక సంవత్సరంలో 90 వేల 451 మంది అక్రమ వలసదారులను అమెరికా అధికారులు గుర్తించారు. అదే 2023లో 96 వేల 917 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. 2023 తో పోల్చితే కాస్త తగ్గినప్పటికీ.. అక్రమ వలసల్లో ఇండియన్స్ ముందున్నారని యూఎస్ అధికారులు చెబుతున్నారు.
పట్టుకున్న 90 వేల 451 మందిలో 78,312 మంది పెళ్లికాని బ్యాచిలర్లే ఉన్నారట. 11,531 మంది మ్యారీడ్ అయినప్పటికీ.. సింగిల్ గా వచ్చినవారు. మిగిలిన 517 మంది మైనర్లు. యూఎస్ లోకి మెక్సికో, కెనడా బార్డర్ల ద్వారా అక్రమంగా ప్రవేశిస్తున్నారని, 2021లో పట్టుకున్న వారిలో దాదాపు బ్యాచిలర్లు ఉండగా.. ఈ ఏడాది పెళ్లైన వాళ్ల ఉండటం గమనార్హం.
పట్టుబడిన వారి వీసాకు డబ్బులేకనో, విద్యార్హత లేకనో అక్రమంగా వెళ్లటం లేదట. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేనివారే ఎక్కువ పట్టుబడ్డారని చెబుతున్నారు. 2024లో యూఎస్ బార్డర్ లో అధికారులు 29 లక్షల 10 మందిని పట్టుకోగా.. అందులో 3.11శాతంతో ఆసియా నుంచి ఇండియన్స్ అధికంగా ఉన్నారని రిపోర్టు ద్వారా తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ.. అక్రమ వలసలను ప్రోత్సహించేది లేదని, పట్టుబడిన ఇండియన్స్ ను తిరిగి తీసుకొస్తామని ప్రకటన చేసింది.