చేతికున్న ఐదు వేళ్లు ఎలా అయితే ఒకేలా ఉండవో.. అభివృద్ధి, పతనం అనేది ఏ రంగంలో కూడా ఒకే విధంగా ఉండదనేది వాస్తవం. పోయినేడాది మొదటి త్రైమాసికంలో 24.4% పతనమైన దేశ ఎకానమీ.. తరువాతి త్రైమాసికంలో వరుసగా 7.5%, 0.4.%, 1.6%, 20.1% గా నమోదవుతుందని ఇండియన్ ఎకనామిక్ స్ట్రాటజీ అంచనా వేసింది. ఈ అంకెలను గ్రాఫికల్‌గా చూస్తే ఇంగ్లీష్ అల్ఫాబెట్ ‘వి’ గుర్తొస్తుంది. ఇండియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) తీవ్రంగా పతనం కావడంతో అది తప్పకుండా ‘వి’ షేప్‌లో రికవర్ అవుతుందని ఏడాది కిందటే అంచనా వేశాం. ఆ టైమ్‌లో దీన్ని చాలామంది అనుమానించారు. ‘‘2019 జూన్ 30 నాటికి నమోదైన స్థూల దేశీయోత్పత్తి గడిచిన 12 నెలల్లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది’’ అనడం లాంటివి అవగాహన లోపించి మాట్లాడుతున్న మాటలేనని తెలుస్తోంది. ‘జీడీపీ’ ఒక కొలమానం అయినప్పుడు మాత్రమే అది కొంత శాతం తగ్గిందని చెప్పడం సాధ్యం. తమకు అనుకూలమైన కథనాలను వినిపిస్తూ, పొలిటికల్ స్కిల్స్‌తో ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధించామని పొగడ్తల కోసం కొంతమంది చెప్పుకోవడానికే తప్ప అది అంత ఈజీ కాదు.
ఆర్థిక సర్వే 2019-20 ప్రకారం..
మన ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎంతో బలమైనదని ‘వి’ ఆకారపు రికవరీ స్పష్టం చేసింది. నేను పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్థిరంగా చెబుతున్నది కూడా ఇదే. ఆర్థిక రంగంలో సమస్యలకు కరోనా మహమ్మారే కారణమని ఆర్థిక సర్వే 2019–-20 అంచనాల్లో వివరించింది. అలాగే ఇది 2014కు ముందు బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేయడం సహా డిపెండింగ్ లెండింగ్ ఫలితమని తేల్చింది. ఆర్థిక రంగంలో ఇలాంటి అవకతవకల కారణంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలం వరకు ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. డిపెండెంట్స్‌కు బంగారు పళ్లెంలో పెట్టి అందించిన బ్యాంకు రుణాల రీ పేమెంట్‌కు 5-6 ఏండ్లు టైమ్ ఉండటమే ఇందుకు కారణమనేది నిజం. పనిలో కమిట్‌మెంట్ లేనివారికి ఎటర్నల్ డెట్స్‌కు బ్యాంకర్ల సపోర్టు కలిసి ఆర్థిక రంగాన్ని గందరగోళంలో పడేశాయి. ఆఖరికి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇతర రంగాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. కాగా,- పెద్దనోట్ల రద్దు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) అమలుతో పాటు, కరోనా కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావానికి ఒక కారణమని కొందరు క్రిటిక్స్ చెబుతున్నారు. అయితే, పెద్దనోట్ల రద్దుతోపాటు జీఎస్టీ అమలు సమయంలో ‘జీడీపీ’ వృద్ధిపై వీటి ప్రభావం లేదని ఈ అంశంపై సాగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం చెబుతూ మన ఆర్ధిక వ్యవస్థ ఎంత పటిష్టమైనదో ఇప్పుడున్న అంకెలు తెలియజేస్తున్నాయి.
కరోనా కారణంగా
కరోనా టైంలో కూడా త్రైమాసిక వృద్ధి ఉందా లేదా అన్నట్టుగానే అనిపించింది. ఆ విధంగా మన ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎంత బలమైనవో మరోసారి తెలిసింది. పోయినేడాది లాక్‌డౌన్ తరువాత ఫస్ట్ క్వార్టర్‌లో తగ్గిన గ్రోత్, ఫోర్త్ క్వార్టర్‌లో ఆంక్షల సడలింపు తరువాత కొంత రికవర్ అయ్యింది. ఇక, సెకండ్ వేవ్ సమయంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలోని మే, జూన్ నెలల్లో అనేక రాష్ట్రాల్లోని మాల్స్, షాపులు తదితర వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న వ్యాపారాలు దెబ్బతినడంతో మార్చి 31 వరకు మాత్రమే కాకుండా జులై మధ్య వరకు కూడా గూగుల్ డైలీ ఇండెక్స్ 70 శాతం వరకు క్షీణించింది. వస్తువుల సరఫరాపై ఆంక్షలు పెద్దగా లేకపోవడంతో పోయినేడాది కనిష్ట స్థాయితో పోల్చి చూస్తే 20 శాతం వరకు పెరుగుదల కనిపించింది. జులై మధ్య తరువాత ఆంక్షలు సడలి సరఫరా పరంగా ఆంక్షలు వినియోగాన్ని తగ్గించినప్పటికీ నిరుటి కనిష్ఠ స్థాయితో పోలిస్తే 20 శాతం వరకు ఎకానమీ రికవర్ అయ్యింది. జూలై మధ్య నుంచి ఆంక్షలను పూర్తిగా సడలించడంతో ఉన్నత స్థాయి సూచీలు అనుకున్నదాని కంటే స్పీడ్‌గా కోలుకున్నాయి.
బ్యాంకుల పాత్ర
కొత్త ఆవిష్కరణల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఖర్చులతో పాటు రుణాలు కూడా తగ్గడంతో కార్పొరేట్ రంగం కొత్త పెట్టుబడులకు రెడీ అవుతోంది. రిటైల్, ఎస్‌ఎంఈ లోన్స్‌లో మొండి బకాయిలను తట్టుకునే స్థాయికి బ్యాంకింగ్ రంగం అభివృద్ధి సాధించింది. ఆ మేరకు ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిలలో రూపాయికి 88 శాతం వరకూ నిధిని ఏర్పరుచుకున్నాయి. మార్కెట్ల నుంచి మూలధనాన్ని బ్యాంకులు సమీకరించుకుంటున్నాయి. దీంతో సంతృప్తి చెందే స్థాయిలో బ్యాంకులు మూలధనాన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఈ విధంగా వరుస రక్షణ చర్యలతో కార్పొరేట్ పెట్టుబడులకు రుణాలు ఇవ్వగలిగే స్థాయికి బ్యాంకులు బలోపేతమయ్యాయి.
కరెన్సీలో నిలకడ
ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఫలితంగా తలెత్తిన రెండంకెల ద్రవ్యోల్బణానికి పూర్తి విరుద్ధంగా పోయినేడాది ఇండియాలో ద్రవ్యోల్బణం సగటున 6.1 శాతంగా నమోదైంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే ఇది సాధ్యమైంది. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా మన ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో పతనానికి కారణం.. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు ఉన్న సమయంలో కూడా ట్రాన్స్‌పోర్టేషన్‌కు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కేంద్రం తీసుకున్న చర్యలే. ఆర్థిక వ్యయాన్ని లక్ష్య నిర్దేశితంగా, క్రమబద్ధంగా రూపొందించుకున్నందున భారత ద్రవ్యలోటు మనలాంటి ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రాబడి వ్యయం గణనీయంగా పెరిగింది. అప్పట్లో మన మార్కెట్లలో విదేశీయుల మదుపు 10 బిలియన్ డాలర్లు మాత్రమే కాగా, నిరుడు 36 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా 8 బిలియన్ల నుంచి దాదాపు 10 రెట్లు పెరిగి 80 బిలియన్ డాలర్లపైకి దూసుకుపోయింది. అదే విధంగా భారత కరెన్సీ విలువ దాదాపు 60% తరిగిపోయినా, ఇప్పుడు మళ్లీ నిలకడ సాధించింది. 2014లో తీవ్ర గందరగోళంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ స్టార్టప్‌ల కారణంగా నేడు అభివృద్ధిని సాధించింది. ఇండియా చరిత్రలో సంఖ్యాపరంగా ‘యూనికార్న్’ (రూ.100 కోట్ల విలువగల) సంస్థలు అత్యధికంగా రావడమేగాక 17 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఆగస్టు ఐపీఓల సంఖ్య కూడా అధికంగా నమోదైంది. వారసత్వ ధనం, వంశపారంపర్య వ్యాపారాలు వంటివి కాకుండా నాణ్యమైన వ్యాపార దృక్పథం ఫలితంగానే యూనికార్న్ సంస్థలు పెరిగాయి. ఈ స్థాయిలో సంస్థలు పెరగడం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గొప్ప ఊరట. మంచి ఆలోచనలు, ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఇండియా సక్సెస్ అయ్యింది. శతాబ్దానికి ఒకసారి వచ్చిపడే దారుణ పరిస్థితుల మధ్య పదునైన అంచనాలతో విశిష్ట ఆర్థిక విధానాలను మన దేశం అమలు చేయగలిగింది.
- డాక్టర్ కె.వి.సుబ్రమణియన్, భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు.