వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇందిర ప్రధానిగా ఉన్న హయాంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే దేశం ప్రగతి సాధించిందన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అంటూ .. మహిళలను స్వయం సాధికారిత కలిగిన శక్తిగా తీర్చిదిద్దే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు,
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో 220 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వాలంబన సాధించేందుకు సౌర విద్యుత్ ప్లాంట్ లను నెలకొల్పుతామన్నారు.