భారత్లో తొలి Mpox కేసు..? ఐసోలేషన్లో విదేశాలనుంచి వచ్చిన వ్యక్తి

భారత్లో తొలి Mpox కేసు..? ఐసోలేషన్లో విదేశాలనుంచి వచ్చిన వ్యక్తి

Mpox..ప్రపంచ దేశాలను వణికుస్తున్న వైరస్..ఎంపాక్స్ ను WHO అంతర్జాతీయ ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్  ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పుడు భారత్ లోనూ చొరబడిందని అనుమానిస్తున్నారు డాక్టర్లు. Mpox వైరస్ ప్రబలంగా ఉన్నా ఓ దేశం నుంచి ఇటీవల ఓ వ్యక్తి ఇండియాకు వచ్చినట్లు గుర్తించారు. అతడిని ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. అతడి రక్తనమూనాలు సేకరించి టెస్టులకు ల్యాబ్ కు పంపారు. అయితే ఎంపాక్స్ విషయంలో ఆందోళన చెందవద్దని .. వైరస్ నుంచి సురక్షితంగా ఉన్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ  Mpox అంతర్జాతీ ఆందోళనకు సంబంధించిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.జనవరి 2022 నుంచి ఆగస్టు 2024 మధ్య 120 కి పైగా దేశాలు MPox  వైరస్ తో పోరాడుతున్నాయని WHO నివేదించింది. దాదాపు లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయని 220కి పైగా మరణాలు సంభవించాయని WHO తెలిపింది.  

మంకీపాక్స్ లక్షణాలు

మంకీపాక్స్ లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. జ్వరం, శరీరమంతా దద్దుర్లు, వాపు శోషరస గ్రంథులు, తలనొప్పి, అలసట ఉంటాయి. ఈ లక్షణాలతోపాటు 2నుంచి 4 వారాల పాటు చర్మంపై దద్దుర్లు, శ్లేష్మ పొరలు కూడా ఉంటాయి. 

Mpox ఎలా సోకుతుందంటే.. 

Mpox వైరస్.. గాలి ద్వారా వ్యాపించదు... ప్రధానం ఈ వైరస్ సోకిన వ్యక్తినుంచి స్పర్శ ద్వారా వ్యాప్తి చెందుతుందని WHO తెలిపింది. రోగి శరీరంపై ఏర్పడే పొక్కులు, స్కాబ్స్ నుంచి వచ్చే ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఒకరి నుంచి ఒకరికి సోకకుండా వ్యక్తిగత రక్షణ చర్యలు  తీసుకోవాలి.

మంకీపాక్స్ కు మందులు 

మంకీపాక్స్ ఇన్ ఫెక్షన్ కు మందులు లేవు.. కానీ మశూచీ, మంకీపాక్స్ వైరస్ లు ఒకే విధంగా ఉంటాయి.. కాబట్టి రోగనిరోధక గ్లోబులిన్, యాంటీవైరల్ మందులు మంకీపాక్స్ చికిత్సలో ఉపయోగిస్తారు.