అదానీకి షాక్.. శ్రీలంకలో ఆగిన అదానీ విండ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

అదానీకి షాక్.. శ్రీలంకలో ఆగిన అదానీ విండ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: శ్రీలంకలో నిర్మించాలనుకుంటున్న విండ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను  అదానీ గ్రీన్ ఎనర్జీ ఆపేసింది. కంపెనీ ప్రపోజ్ చేసిన కరెంట్‌‌‌‌‌‌‌‌ రేట్లు అక్కడి ప్రభుత్వానికి నచ్చకపోవడంతో పూర్తిగా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను ఆపేయాలని నిర్ణయించుకుంది. 

శ్రీలంకలో సుమారు రూ.8,700 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని అదానీ గ్రూప్ చూసింది. విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు రెండు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల నుంచి కూడా వెనక్కి తగ్గింది. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే నేతృత్వంలోని ప్రభుత్వం కరెంట్ రేట్లను తగ్గించాలని అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను అడిగింది. 

మరోవైపు శ్రీలంకలోని కొలంబో పోర్టులో టెర్మినల్‌‌‌‌‌‌‌‌ను కట్టడానికి 700 మిలియన్ డాలర్లను  అదానీ గ్రూప్ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది.