ASK GITA.. ఇదొక ఇండియన్ AI సంచలనం..ఇప్పుడు జి20 సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణ.. సమావేశం జరిగే ప్రగతి మైదాన్ భారత్ మండపంలో హాల్స్లో డిజిటల్ ఇండియా ఎక్స్పీరియెన్స్ జోన్లో ఇన్స్టాల్ చేశారు. ASK G.I.T.A ఎగ్జిబిట్.. పవిత్ర గ్రంథం భగవద్గీతలో పేర్కొన్న విధంగా తగిన పరిష్కారాలను అందించే అద్భుత వినూత్న వేదిక. శ్రీమద్ భగవద్గీత ఆధారంగా ప్రశ్నలకు సమాధానిమిచ్చే AI మోడల్.
ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలోని 4, 16 హాల్స్లో డిజిటల్ ఇండియా ఎక్స్పీరియెన్స్ జోన్ లో దీనినిఇన్ స్టాల్ చేశారు. GITA ప్రతినిధులతో సహా సందర్శకులందరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇంగ్లీషు, హిందీ భాషలతో AI మోడల్ ఆధారిత ASK GITA ద్వారా జీవితంలో ఎదురైన సమస్యలకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా తగిన పరిష్కారాలను అందిస్తుంది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆధ్వర్యంలో దేశంలో డిజిటల్ సామర్థ్యం, సేవలను ప్రపంచానికి తెలిపడమే లక్ష్యంగా ప్రగతి మైదాన్ లో డిజిటల్ ఇండియా ఎక్స్ పీరియన్స్ జోన్ ను ఏర్పాటు చేశారు. 2014 నుంచి భారత్ లో డిజిటల్ పురోగతి, వర్చువల్ ప్రయాణాన్ని తెలియజేస్తుందని పీఐబీ ట్విట్టర్ లో పేర్కొంది.