ఇండియా కూటమి దూకుడు

ఇండియా కూటమి దూకుడు

నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో ఘన విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ఓటమిపాలవుతుందని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఒడిశాకు చెందిన బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూటమిలో లేకపోవడంతో కాంగ్రెస్ కూటమి అధికార బీజేపీని సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 

ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయం సాధించి సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే వాస్తవాన్ని కాంగ్రెస్ గ్రహించింది. ఇప్పటివరకూ పార్లమెంటు చరిత్రలో 17సార్లు లోక్​సభ ఎన్నికలు జరిగాయి. అయితే,  కాంగ్రెస్ పార్టీ మొత్తం  542 పార్లమెంటు నియోజకవర్గాల్లో  450 ఎంపీల స్థానాలకు తక్కువగా ఎన్నడూ పోటీ చేయలేదు. 2019లో కూడా కాంగ్రెస్ 450 లోక్​సభ స్థానాల్లో పోటీ చేసి 44 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. 450 మంది ఎంపీలకు పోటీ చేసి కేవలం 50 మంది ఎంపీలను గెలిపించాలా లేక 250 మంది ఎంపీలకు పోటీ చేసి 100 మందికి పైగా ఎంపీలను పొత్తుల ద్వారా గెలిపించాలా అనేది ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్నకీలక ప్రశ్న. 

‘ఇండియా’తో బీజేపీకి ముప్పు

450 లోక్​సభ నియోజక వర్గాల్లో తమకు వ్యతిరేకంగా ఒకే ఒక్క అభ్యర్థితో సమైక్యంగా ప్రతిపక్ష కూటమి పోరాడితే తమకు ముప్పు తప్పదని బీజేపీకి తెలుసు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొత్తు కుదరదని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.170 సంవత్సరాల క్రితం గొప్ప అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ చెప్పినది బహుశా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుర్తుండవచ్చు. మీరు మీ శత్రువులను ఎలా నాశనం చేయగలరనే ప్రశ్న వచ్చినప్పుడు.. మీరు మీ శత్రువులను మీ స్నేహితులుగా చేసుకోవడం ద్వారా విజయం సాధించవచ్చనేది ఓ పరిష్కారం. లేదా, భారతదేశంలో 2,500 సంవత్సరాల క్రితమే చాణక్యుడు చెప్పినట్లు ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’.  ఆమ్ ఆద్మీ పార్టీ  అధినేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ వంటి రాజకీయ శత్రువులు కూడా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా శత్రువులు. కాబట్టి వారితో స్నేహం చేయవలసి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. ఢిల్లీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో శత్రువులతో జతకట్టడం వల్ల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించి విజయం సాధించవచ్చు. ఈ నాలుగు రాష్ట్రాల్లో 143 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 143 లోక్​సభ స్థానాల్లో పోటీ చేసి  కేవలం10 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. మళ్లీ 143 మంది పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి కేవలం 10 మందిని గెలిపించుకోగలగటం కంటే మరోసారి బీజేపీకి గెలిచే అవకాశం ఎందుకు ఇవ్వాలి. 

కాంగ్రెస్​ పెద్ద త్యాగాలు

ప్రతిపక్షాల ఇండియా కూటమి ఐక్యత కోసం ప్రధాన పార్టీ కాంగ్రెస్ పెద్ద త్యాగాలు చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారథ్యంలోని ఇండియా కూటమి సఖ్యత సాధించలేదని బీజేపీ కచ్చితంగా నమ్ముతున్నది. భారత కూటమికి సీట్ల పంపకం అసాధ్యమైన పెను సమస్యగా మారుతుందని బీజేపీ భావించింది. అయితే చారిత్రక శత్రువులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒక్కటయ్యారు. కాంగ్రెస్​తో పొత్తుకు సిద్ధంగా ఉన్నారు.  ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై కూడా ఇండియా కూటమిలో వివాదాలు వస్తాయని అధికార బీజేపీ భావించింది. ప్రాంతీయ నాయకులంతా ప్రతిష్టాత్మకంగా భావిస్తారని, అందరూ ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ అభ్యర్థియే ఉండాలని ఇండియా కూటమిలో నాయకులు కోరుకుంటున్నట్లు బీజేపీ భావించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. లోక్​సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఇండియా కూటమి వెల్లడించింది. ప్రధాన అడ్డంకిని సులభంగా దాటింది.

ఇండియా కూటమి పొత్తుల లాభాలు

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాల ఇండియా కూటమి క్రమం తప్పకుండా సమావేశమవుతోంది. ఇండియా కూటమి సమావేశాల్లో పెద్దగా స్పష్టమైన తేడాలు ఏమీ కనిపించడం లేదు. బీజేపీపై ఉన్న భయమే ప్రతిపక్షాల నాయకులందరూ ఏకం అవడానికి ఓ కారణంగా కనిపిస్తున్నది. బీజేపీ ముందుగా భావించినట్లుగా ఇండియా కూటమికి త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో సీట్లు పంచుకోవడంలో తీవ్రమైన సమస్యలు లేవు. తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, అస్సాం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఇప్పటికే ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, కేరళ, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో పొత్తు ఉండకపోవచ్చు.  బీజేపీ కూడా అధికంగా ఎంపీ స్థానాలను సొంతం చేసుకోలేదు. కాబట్టి పొత్తు అవసరం లేదు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, కర్ణాటకలో బీజేపీకి దీటైన పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీలు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీని ఎదుర్కొంటుంది. 

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్​తో,  పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీతో ఇండియా కూటమికి ఇబ్బందులు ఎదురవుతాయని కాషాయ పార్టీ నాయకులు భావించారు. కానీ, ఢిల్లీలో కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పొత్తు పెట్టుకున్నారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మమతా బెనర్జీ  పొత్తులో భాగంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి కేవలం 2 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ  మరికొన్ని సీట్లను  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఈ సమస్యను ఇరుపార్టీలు తేలికగానే పరిష్కరించుకోగలవు. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సభ్యులు ఎవరూ లేరు.

బీజేపీకి కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పాలి

వరుస విజయాలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అధికార దర్పంతో చేపట్టిన చర్యలే ప్రతిపక్షాల్లో ఐక్యతను తెచ్చిపెట్టాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, అఖిలేశ్ యాదవ్  తదితరులపై బీజేపీ ప్రభుత్వ సంస్థలను ప్రయోగించి వారిని వెంటాడింది. బీజేపీని ఓడిస్తే తప్ప తమకు మనుగడ లేదని ఈ నేతలు తేల్చుకున్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి  చారిత్రక శత్రువులు ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారథ్యంలోని ఇండియా కూటమిలో చేరారు. బీజేపీయే తన శత్రువులందరినీ ఏకం చేసింది. కానీ, బీజేపీలో చాణక్యులు చాలామంది ఉన్నారని మాత్రం చెప్పకండి.

ఇండియా భాగస్వామ్య పక్షాల డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే

పార్లమెంటు ఎన్నికల్లో 250 లోక్​సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆమోదం తెలపడమే కాంగ్రెస్ వేసిన అతిపెద్ద అడుగు. 1952 నుంచి ఇప్పటివరకూ జరిగిన 17 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 450 మంది తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపేది. ఇప్పుడు కాంగ్రెస్ 250 ఎంపీ స్థానాలకు దిగివచ్చి అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వాములు పోటీ చేసేందుకు అంగీకరించింది. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ కూడా పట్టుబట్టడం లేదు. ఇది ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపరిచింది. ఎందుకంటే కూటమి పొత్తులో భాగంగా కొనసాగుతున్న ప్రతిపక్ష పార్టీలు తమకంటే కాంగ్రెస్ బలంగా ఉండాలని కోరుకోవు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే తమ ప్రయోజనాలకు పెద్దపీట లభించదని కూటమిలో నాయకులకు తెలుసు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీర్ఘకాలిక పరిణామాలు

కేవలం 250 ఎంపీ స్థానాల్లో  పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తన స్థానాన్ని ఖాళీ చేస్తోంది.  ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఎదిగితే కాంగ్రెస్ పార్టీ క్రమ క్రమంగా కనుమరుగవుతుంది. పొత్తుల తర్వాత తమిళనాడు, బిహార్, ఒడిశా, మహారాష్ట్రల్లో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోతుంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పొంచి ఉన్న  మరో ప్రమాదం ఏంటంటే  హస్తం పార్టీ జాతీయ స్థాయిలో ఉనికిని కోల్పోవడం ప్రారంభ మవుతుంది. అయితే, మరోవైపు 2024లో ఇండియా కూటమి కేంద్రంలో అధికార బీజేపీని ఓడిస్తే, కాంగ్రెస్ చాలా ఏండ్లపాటు నిలదొక్కుకోగలదు. 450 నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ఒక్క ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం అనేది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి పెద్ద విజయం అనే చెప్పాలి. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. 1977లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి ఇందిరాగాంధీని ఓడించాయి. ఇండియా కూటమి ఐక్యత ఇప్పుడు బీజేపీకి గట్టి సవాల్​ విసురుతోంది.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​