దేశంలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డేటా లీక్ కేసుల్లో ఒకటైన ఓ కేసు ఇటీవలే వెలుగులోకి వచ్చింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో 81.5 కోట్ల మంది భారతీయుల వివరాలు అమ్మకానికి ఉన్నట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. ICMR ఈ విషయంపై .. ఫిర్యాదును దాఖలు చేసిన తర్వాత భారత ప్రధాన ఏజెన్సీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. దీనిపై విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
గతంలో Xలో ఒక వ్యక్తి డార్క్ వెబ్ ఫోరమ్‌లో ఓ డేటాబేస్‌ను ప్రచారం చేశాడు. ఇందులో 81.5 మిలియన్ల భారతీయుల రికార్డులు ఉన్నాయి. వారి పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలతో పాటు ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారం కూడా ఉంది. పౌరుల కొవిడ్-19 పరీక్ష వివరాల నుంచి సేకరించిన డేటా - ICMR నుంచి తీసుకోబడినదని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
ICMR ఫిబ్రవరి నుంచి అనేక సైబర్-దాడి ప్రయత్నాలను ఎదుర్కొంటోంది. ఈ విషయం కేంద్ర ఏజెన్సీలతో పాటు కౌన్సిల్‌కు కూడా తెలుసు. ICMR సర్వర్‌లను హ్యాక్ చేయడానికి 2022లో 6వేల సార్లకు పైగా ప్రయత్నాలు జరిగాయి. ఏదైనా డేటా లీక్‌ను నివారించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలు ICMRని కోరినట్లు పలు నివేదికలు తెలిపాయి.
ALSO READ : నీకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకో.. శీతల్ దేవికి ఆనంద్ మహీంద్రా ఆఫర్