
చరిత్ర, సంప్రదాయాలు, ప్రాంతాలను బట్టి కొన్ని వంటకాలు ఫేమస్ అవుతూ ఉంటాయి. వీటినే ఐకానిక్ ఫుడ్స్ అంటారు. ఇటీవల ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఓ పోస్ట్‌ను చేశారు. ఇందులో ఉన్న ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇందులో ఇండియాలో ఫేమస్ అయిన బటర్ చికెన్ కూడా ఉండడం విశేషం. ఇతర దేశాలకు చెందిన ఈ ఐకానిక్ వంటకాల్లో ఇండియన్ ఫుడ్ కూడా ఉండడం చెప్పుకోదగిన విషయం.
నాచోస్ (1943)
పాస్తా కార్బోనారా (1944)
కర్రీవర్స్ట్ (1949)
కార్పాసియో (1950)
బటర్ చికెన్ (1950లు)
షాప్స్కా సలాటా (1955)
హవాయి పిజ్జా (1962)
స్టిక్కీ టోఫీ పుడ్డింగ్ (1960లు)
ఉరమకి (1960లు)
తిరమిసు (1960లు)
బానోఫీ పై (1971)
ఫజితాస్ (1971)
జనరల్ త్సోస్ చికెన్ (1973)
చికెన్ టిక్కా మసాలా (1970లు)
డోనర్ కబాబ్ శాండ్‌విచ్ (1970లు)
పాస్తా ప్రైమవేరా (1975)
టార్టిఫ్లెట్ (1975)
సియాబట్టా (1982)
సాల్మన్ సుషీ (1980లు)
కరిగిన చాక్లెట్ కేక్ (1987)
ఇవన్నీ కూడా టైమ్‌లెస్ క్లాసిక్‌లుగా పరిగణించే వంటకాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వెరైటీలతో రోజుకో ఫుడ్ వెరైటీ పుట్టుకొస్తున్నాయి. సంప్రదాయాలతో వచ్చేవి కొన్నైతే.. వెరైటీ పేరుతో వేరు వేరు కాంబినేషన్ ఐటెమ్స్ తో వచ్చేవి మరికొన్ని. ఇవి ఎప్పటికప్పుడు మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని, అది తీసుకురాగల ఆనందకరమైన ఆవిష్కరణలను మరింత నొక్కిచెబుతున్నాయి.