సియోల్: కొరియా ఓపెన్ సూపర్500 టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. అష్మితా చాలిహా, మాళవిక బన్సొద్, ఆకర్షి కశ్యప్ నిరాశపరిచాడు. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 53వ ర్యాంకర్ అష్మితా 8–21, 13–21తో 17వ సీడ్ పొర్న్‌పవీ చొచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో చిత్తవగా.. ఆకర్షి 15–21, 15–21తో డెన్మార్క్ షట్లర్ లిన్ క్రిస్టోఫర్సెన్ చేతిలో ఓడింది.
41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హొజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆయుశ్ రాజ్–శ్రుతి స్వైన్ కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.