చంద్రుడిపైకి పంపించిన లూనా 25 కంటే చంద్రయాన్ 3 చాలా భిన్నమైనదని ఇస్రో శాస్ర్తవేత్తలు అంటున్నారు. చంద్రయాన్3 ప్రయోగ నిబంధనలు, మెథడాలజీ, దాని రూట్ పరంగా లూనా 25 కంటే చంద్రయాన్3 చాలా మెరుగైనదని పేర్కొన్నారు. చంద్రునిపై పరిశోధనలకోసంచంద్రయాన్ 3 ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జూలై 14 న ప్రయోగించగా.. లూనా 25ని ఆగస్టు 11న రష్యా ప్రయోగించింది. 40 రోజులు ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 ఆగస్టు 23న ల్యాండింగ్ కానుంది. మరోవైపు చంద్రయాన్ 3కంటే రెండు రోజుల ముందే లూనా25 చంద్రునిపై ఆగస్టు 21 ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండు మిషన్లు చంద్రుని దక్షిణ దృవంపై దిగేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇస్రో శాస్ర్తవేత్తలు అంటున్నారు.
గత నెలలో చంద్రునిపై చంద్రయాన్ 3 చంద్ర ల్యాండర్ ను ప్రయోగించిన భారత్ తో ఇప్పుడు రష్యా చంద్ర మిషన్ పోటీ పడుతోంది. వ్యోమనౌకపై భూమి, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కారణంగా 40 రోజుల తర్వాత చంద్రునిపై ల్యాండ్ కానుందని ఇస్రో సైంటిస్ట్ పేర్కొన్నారు. అయితే లూనా25 అధిక శక్తి, అధిక ఇంధన శక్తి లోడ్ తో కూడిన రాకెట్..ఎటువంటి బాహ్య శక్తిపై ఆధారపడకుండా అంతరిక్ష నౌకకు శక్తినివ్వగలదు.
అయితే లూనా25 తో రష్యా 47 ఏళ్ల తర్వాత చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా నిలువనుంది. సోయుజ్ 2.1 రాకెట్.. లూనా-25 క్రాఫ్ట్‌ను ఆగస్టు 11న మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల (5,550 కి.మీ) దూరంలో ఉన్న వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి మోసుకెళ్లింది. లూనా-25 ఇంచుమించు చిన్న కారు పరిమాణంలో ఉంటుంది. దీని ల్యాండర్ ఆగస్టు 21న చంద్రుడిని తాకుతుందని భావిస్తున్నారు. ఏ దేశమూ చంద్రుని దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేదు. 2019లో భారత్ చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైంది.
చంద్రయాన్-3
భారతదేశం చేప్టిన ప్రతిష్టాత్మక మూడవ మూన్ మిషన్ 'చంద్రయాన్-3. ఇది ఆగస్ట్ 23 లేదా 24 మధ్య చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో సురక్షితంగా ల్యాండ్ కానుంది. ISRO చే అభివృద్ధి చేయబడిన ఐ చంద్రయాన్-3లో విక్రమ్ అనే ల్యాండర్ మాడ్యూల్ ఉంది. దీని అర్థం సంస్కృతంలో "శౌర్యం", రోవర్ కు ప్రజ్ఞాన్ పేరు పెట్టారు. దీనర్థం వివేకం అనే సంస్కృత పదం. ల్యాండింగ్ విజయవంతమైతే రోవర్ విక్రమ్‌ను చుట్టుముట్టు, సమీపంలోని చంద్ర ప్రాంతాన్ని అన్వేషిస్తుంది, విశ్లేషణ కోసం భూమికి తిరిగి పంపడానికి చిత్రాలను సేకరిస్తుంది.రోవర్ ఒక చాంద్రమాన రోజు లేదా 14 భూమి రోజుల మిషన్ జీవితాన్ని కలిగి ఉంది.