ఇండియాకు చావోరేవో.. ఇవాళ (ఏప్రిల్ 29) ఇండోనేసియాతో పోరు

ఇండియాకు చావోరేవో.. ఇవాళ (ఏప్రిల్ 29) ఇండోనేసియాతో పోరు

జియమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనా): ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓటమితో ఆరంభించిన ఇండియా బ్యాడ్మింటన్ టీమ్ మెగా టోర్నీలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. టోర్నీలో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో మంగళవారం జరిగే గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బలమైన ఇండోనేసియాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో చిత్తయిన ఇండియా  తీవ్ర ఒత్తిడిలో ఉంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రెండు జట్లు మాత్రమే నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకోనున్న నేపథ్యంలో ఇండోనేసియాపై గెలిస్తేనే ఇండియా రేసులో నిలుస్తుంది. 

లేదంటే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నామమాత్రమే కానుంది. సింగిల్స్ స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రణయ్ పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును దెబ్బతీస్తోంది. అయితే, సేన్.. ఇండోనేసియా టాప్ ప్లేయర్ జొనాథన్ క్రిస్టీని పారిస్ ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడించడం సానుకూలాంశం. మూడోసారి అతని పని పడితే ఇండియా అవకాశాలు మెరుగుపడతాయి. ఇక  ఇండోనేషియా టాప్ సింగిల్స్ ప్లేయర్ గ్రెగోరియా మారిస్కా టుంజుంగ్ గైర్హాజరీలో పుత్రీ కుసుమతో సింధు తలపడనుంది. 

'ఆమెను గతంలో రెండుసార్లు ఓడించింది. డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మాత్రం ఇండోనేసియా చాలా బలంగా ఉంది. ఫజర్ ఆల్ఫియన్– మహ్మద్ రియాన్ అర్డియాంటో–లియో రోలీ కార్నాండో వంటి టాప్-10– జోడీలు ఇండియాకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విసురుతున్నాయి. సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్– చిరాగ్ శెట్టి  గైర్హాజరీలో హరిహరన్ –రూబన్ కుమార్ జోడీ కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. మహిళల డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనీషా క్రాస్టో– శృతి మిశ్రా జోడీ  డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వయంపై గెలిచింది. 

అదే  ఊపుతో వరల్డ్ నంబర్ 8 జోడీ ఫెబ్రియానా కుసుమ– అమలియా కహాయ ప్రతివితో పోటీపడనుంది. మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధ్రువ్ కపిల– తనిషా జోడీ వరల్డ్ నంబర్ 21 జోడీ రినోవ్ రివాల్డీ– పిథా హనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్యాస్ మెంటారీతో తలపడనుంది. సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లతో పాటు డబుల్స్ షట్లర్లు మెప్పిస్తేనే ఇండోనేసియాను ఇండియా 
నిలువరించగలదు.