న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పది వేలకు దిగువన కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8 వేల వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనాతో మరో 119 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా నుంచి మరో 16 వేల పైచిలుకు మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1.02 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి 4.23 కోట్ల మందికి పైగా కోలుకోగా.. 5.13 లక్షల మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 177.50 కోట్ల పైగా టీకా డోసులను కేంద్రం పంపిణీ చేసింది.
#India's daily #COVID19 cases on Monday dropped below 10,000 for the first time since the beginning of third wave and recorded 8,013 fresh infections in a span of 24 hours.@MoHFW_INDIA pic.twitter.com/KERSnreIIN
— IANS Tweets (@ians_india) February 28, 2022