Indias Diverse Talent: AI భవిష్యత్కు ఇండియన్ టాలెంట్ చాలా కీలకం..మెటా చీఫ్ సైంటిస్ట్

న్యూఢిల్లీ:విభిన్నమైన ఇండియన్ల టాలెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎంతో కీలకం అని మెటా చీఫ్ సైంటిస్ట్  డాక్టర్ యన్ లికన్ అన్నారు. భిన్న సంస్కృతులు, విలువైన వ్యవస్థలు, జనాభా కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ యన్ లికన్ స్పష్టం చేశారు. 

ఢిల్లీ ఐఐటీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మెటా చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ యన్ లికన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో గ్రామీణ రైతులు తమ యాస భాషల్లో ఏఐ ని స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగించి  వ్యవసాయంలో తమ సందేహాలను తీర్చుకుంటారని ఊహించారు. Meta  LLaMA3  ఫీచర్ మోడల్ ఉపయోగించి భారత్ లోని అన్ని భాషల్లో సపోర్టు చేస్తుందని అన్నారు. అంతేకాదు..రాయబడని లిపిని కూడా ట్రాన్స్ లేట్ చేసే రోజులు వస్తాయన్నారు. 

AI అభివృద్ది  సహకారం, ఆవిష్కరణలపై ఆధారపడి ఉందన్నారు యన్ లికన్. కొత్త ఆర్కిటెక్చర్‌లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ వంటి భారత విభిన్న ప్రతిభతో AI సామాజిక వృద్ధికి శక్తివంతమైన సాధనంగా మారుతుంది, వ్యక్తిని శక్తివంతం చేస్తుందన్నారు.

ALSO READ | టీనేజర్లపై AI ప్రభావం అంతుందా..? నా కొడుకు చావుకు కారణం AI చాట్బాటే.. ఫ్లోరిడా తల్లి ఫిర్యాదు

నిజమైన మానవ-వంటి మేధస్సును సాధించడానికి ప్రస్తుత AI నమూనాలు సరిపోవని అతను వాదించాడు.AI అభివృద్ధికి ప్రస్తుత విధానాలను సవాలు చేస్తూ వినూత్న నిర్మాణాలకు భాషా నమూనాలకు (LLMలు) పెద్దపీట వేయాలని కోరారు.ప్రస్తుత నమూనాను ఉపయోగించి , AI పెద్దదిగా చేయడం ద్వారా ఆ దశకు చేరుకోలేం.. ఆబ్జెక్టివ్-డ్రైవెన్ ఆర్కిటెక్చర్ వంటి కొత్త నిర్మాణాలు కావాలన్నారు. 

AI భద్రత గురించి ఆందోళన వ్యక్తం అవుతున్న క్రమంలో యన్ లికన్ ప్రస్తావిస్తూ.. మానవులపై ఆధిపత్యం చెలాయించే మేథో వ్యవస్థల గురించి భయపడాల్సిన పనిలేదన్నారు.భవిష్యత్తు అంతా AI దే.. స్మార్ట్ గ్లాస్ లాంటి డిజిటల్ అసిస్టెంట్ తో ప్రపంచం నడుస్తుందన్నారు యన్ లికన్.