ఇండియా ఇలా : ఎగుమతులు భారీగా పడిపోయి.. దిగుమతులు పెరిగి..

ఇండియా ఇలా : ఎగుమతులు భారీగా పడిపోయి.. దిగుమతులు పెరిగి..

దేశ ఆర్థిక పరిస్థితి బలంగా ఉందా లేదా అన్నది ఆ దేశ ఎగుమతులు, దిగుమతుల నిష్పత్తిని బట్టి కూడా చెప్పచ్చు. దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటే ఆర్థికంగా దేశం బలంగా ఉందని చెప్పచ్చు. భారతదేశ ఎగుమతులు, దిగుమతుల గురించి  చెప్పేందుకే ఈ ఉపోద్గాతం అంతా.. ఈ ఏడాది ఇండియా ఎగుమతులు భారీగా పడిపోయాయి. గత ఏడాది ఆగస్టు నెలతో పోలిస్తే 2024 ఆగస్టు నెలలో ఇండియా ఎగుమతులు 9.3శాతం మేర పడిపోయాయి. 

2023లో ఆగస్టు నెల నాటికి ఇండియా ఎగుమతులు 34.71 బిలియన్ డాలర్లగా నమోదయ్యాయి. గ్లోబల్ ఎకానమీలో నెలకొన్న అనిశ్చితి ఈ పరిస్థితికి కారణమని చెప్పచ్చు.ఇక దిగుమతుల విషయానికి వస్తే ఈ ఏడాది 3.3శాతం పెరిగి 64.36 బిలియన్ డాలర్లగా నమోదయ్యాయి. దిగుమతుల్లో పెరుగుదల దేశంలో పెరిగిన డిమాండ్ ను సూచిస్తుంది.

Also Read:-రికార్డ్ డేట్ తర్వాత రోజే బోనస్ షేర్ల క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడాను బట్టి చూస్తే ఇండియాలో ఫారిన్ గూడ్స్ కి డిమాండ్ పెరిగిందని చెప్పచ్చు. అంతే కాకుండా ట్రేడ్ లో అసమానతలను కూడా సూచిస్తుంది.