Dipa Karmakar: తప్పుకుంటున్నా.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా జిమ్నాస్ట్

Dipa Karmakar: తప్పుకుంటున్నా.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా జిమ్నాస్ట్

2016 రియో ఒలింపిక్ క్రీడల్లో మెరిసిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తాను పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఎంతో ఆలోచించిన తర్వాత జిమ్నాస్టిక్స్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ నిర్ణయం కష్టమైనది అయినప్పటికీ, కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇది సరైన సమయంగా భావించి తప్పుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.   

"జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎంతో ఆలోచించాక ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ నా కెరీర్‌కు విడ్కోలు ప‌ల‌క‌డానికి ఇదే స‌రైన స‌మయం అన్నిస్తోంది. జిమ్నాస్టిక్స్ నా జీవితంలో ఒక భాగం. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌విచూశాను. ప్రతిదానికీ నేను కృతజ్ఞుడను. .." అని  దీపా కర్మాకర్ సుధీర్ఘ పోస్టును పంచుకుంది. 

భారత తొలి మహిళా ఒలింపిక్ జిమ్నాస్ట్‌

2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించి దీపా కర్మాకర్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత ఆసియన్‌ గేమ్స్‌లోనూ గోల్డ్‌ మెడల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. అనంతరం 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ద్వారా భారత తొలి మహిళా జిమ్నాస్ట్‌గా అవతరించింది. ఆ క్రీడల్లో కర్మాకర్ తృటిలో కాంస్య పతకాన్ని  చేజార్చుకుంది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో నాల్గవ స్థానంలో నిలిచింది.

ALSO READ | IND vs PAK: ఆట తక్కువ.. వేషాలు ఎక్కువ: డగౌట్‌లో పాక్ ఆల్‌రౌండర్ వెర్రి నవ్వులు