దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జిని తమిళనాడులో సీఎం స్టాలిన్ ప్రారంభించారు. కన్యాకుమారి తీరంలో వివేకానంద రాక్ మెమోరియల్ ను 133 అడుగుల ఎత్తైన తిరువల్లువర్ విగ్రహాన్ని కలుపుతూ నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని డిసెంబర్ 30న సోమవారం సాయంత్రం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.
Also Read :- కిక్కు ఎక్కువైతే.. క్యాబ్.. ఆటోల్లో ఇంటికి పంపిస్తాం
ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తిరువల్లువర్ విగ్రహావిష్కరణ రజతోత్సవం సందర్భంగా ప్రారంభించారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కనిమొళి, ఉన్నతాధికారులతో కలిసి ఈ బ్రిడ్జిపై నుంచి నడిచారు. తిరువళ్లువర్ విగ్రహం దగ్గర లేజర్ లైట్ షో నిర్వహించారు.
37 కోట్లు ఖర్చు
తమిళనాడు ప్రభుత్వం 2023 మే 24న లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 77 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో రూ. 37 కోట్ల వ్యయం తో ఈ బ్రిడ్జి నిర్మించింది. త్వరలోనే ఈ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. పర్యాటకులను ఈ బ్రిడ్జి విపరీతంగా ఆకర్షిస్తోంది.
#WATCH | Kanniyakumari: Tamil Nadu Chief Minister MK Stalin inaugurated a glass bridge over the sea, connecting Tiruvalluvar Statue and Vivekananda Rock Memorial, in Kanniyakumari yesterday
— ANI (@ANI) December 31, 2024
(Source: Tamil Nadu DIPR) pic.twitter.com/86src7srTI