బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..

బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..

బెంగళూరులో తొలి HMPV కేసు నమోదవ్వటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది... బెంగళూరు సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టులు పరిశీలించగా.. ఈ వైరస్ విషయం వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు అధికారులు. ఎనిమిది నెలల చిన్న పాపకు ఈ వైరస్ ఎటాక్ అయ్యిందని వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

బెంగళూరులోని నార్త్ ఏరియాలోని ఓ ప్రముఖ బాప్టిస్ట్ ఆస్పత్రికి.. HMPV వైరస్ లక్షణాలతో ఉన్న 8 నెలల చిన్నారి వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఎనిమిది నెలల చిన్నారి.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుందని తెలిపారు. HMPV వైరస్ ముఖ్యంగా 11 ఏళ్లలోపు చిన్నారులకు త్వరగా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు డాక్టర్లు.బెంగళూరులో తొలి HMPV వైరస్ కేసు నిర్దారణ అయిన క్రమంలో గైడ్ లైన్స్ జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం.

కర్ణాటక ప్రభుత్వం జార్ చేసిన గైడ్ లైన్స్:

శీతాకాలంలో HMPV జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలకు దారితీస్తుందని, ఇది రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఎక్కువ హాని కలిగిస్తుందని తెలిపారు వైద్యాధికారులు. ఈ క్రమంలో HMPV వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలకు సిద్ధమైంది కర్ణాటక ప్రభుత్వం. ఇన్‌ఫ్లుఎంజా-లైక్ ఇల్‌నెస్‌లు (ILI), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌లు (SARI)తో సహా జలుబుకు సంబంధించిన ఏవైనా వ్యాధుల వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

Also Read :- అసలే సంక్రాంతి పండగ రద్దీ.. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం

గత ఏడాదితో పోలిస్తే.. డిసెంబర్ 2024 నాటికి, సాధారణ జలుబు, ILI, SARI కేసుల గణనీయమైన పెరుగుదల లేదని స్పష్టం చేశారు అధికారులు. ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం వల్ల రాష్ట్ర సరిహద్దులకు HMPV వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు సిద్దమైనట్లు తెలిపారు అధికారులు.

అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం, ఒకరి ముఖాన్ని తాకడం, మరియు జ్వరం, దగ్గు లేదా తుమ్ము లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని సూచించింది ప్రభుత్వం. ప్రజారోగ్య భద్రతను బలోపేతం చేయడానికి ఈ గైడ్ లైన్స్ జారీ చేసినట్లు తెలిపింది ప్రభుత్వం.